ఖమ్మం జిల్లాలో రోడ్డుప్రమాదం : ఐదుగురి మృతి

ఖమ్మం, నవంబర్ 4: ఖమ్మం జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం వి.ఎం.బంజర సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కొత్తగూడెం నుంచి బొగ్గులోడుతో విజయవాడవైపు వెళ్తున్న లారీ అతి వేగంతో ఆటోను వెనుక నుంచి ఢీకొనడంతో ఆటోతో సహా లారీ రోడ్డుపక్కన పొలాల్లోకి దూసుకెళ్లాయి. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.