ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం

హైదరాబాద్, సెప్టెంబర్ 9 : సుదీర్ఘ శోభాయాత్ర అనంతరం హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ మహాగణపతిని భారీ క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేశారు. సుమారు 20 గంటల పాటు సుదీర్ఘ శోభాయాత్ర అనంతరం నిమజ్జన కార్యక్రమం ముగిసింది. నగరంలో లక్షలాది మంది భక్తులచే పూజలందుకున్న 60 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.  దీంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.