‘గబ్బర్ సింగ్ 2’ కి ముహూర్తం ఖరారు

Gabbar-singh-2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకొని, భారీ కలెక్షన్ లను సాధించిన సంగతి తెలిసిందే. అయితే దాని తర్వాత ‘గబ్బర్ సింగ్ 2’ కూడా రెడీ అవుతుందనీ.. ఆ తర్వాత పవన్ కి స్క్రిప్ట్ నచ్చలేదని.. ఇలా చాలా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకి ముహూర్తం తేదిని కూడా ఖరారు చేసారు.

ఈ నెల 21న ఉదయం 6గంటలకు ఫిలిం నగర్ లోని దైవసన్నిధానం ప్రాంగణంలో ఈ సినిమా ముహూర్తాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం మార్చి నెలాఖరు నుంచి ప్రారంభిస్తారని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ‘గబ్బర్ సింగ్ 2’ హిరోయిన్ అన్వేషణ కూడా జరుగుతోంది. ‘రచ్చ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది దర్శకత్వంలో శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.