‘గబ్బర్ సింగ్ 2’ రెడీ అవుతోంది

Gabbar-singh-2

పవన్ కళ్యణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ భారీ విజయాన్ని, భారీ కలెక్షన్ లను సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘గబ్బర్ సింగ్ 2’ మొదట్నుంచి అందుకు భిన్నంగా వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ‘గబ్బర్ సింగ్ 2’ స్టోరీ పవన్ కు నచ్చలేదని అందకే పవన్ ఈ సినిమాను పవన్ రద్దు చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం ‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత ప్రారంభం కావాల్సి ఉంది. అనేక సార్లు వాయిదా పడుతూ రావడం, తాజాగా విక్టరీ వెంకటేష్ నటించే ‘ఓ మై గాడ్’ తెలుగు రీమేక్ లో నటించడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడంటూ అధికారికంగా రావడంతో ఇక ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా లేనట్టేనని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను యూనిట్ వర్గాలు ఖండించాయి.

ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా దర్శకుడు సంపత్ నందితో పవన్ ప్రతిరోజూ కూర్చుని స్క్రిప్ట్ వర్క్ చూస్తున్నాడని చెబుతున్నారు. అయితే సినిమా ఈ నెలాఖరులో గానీ, మార్చి మొదటి వారంలో కానీ సెట్స్ మీదకి వెళ్లడం ఖాయమని సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.