గవర్నర్ ను కలిసిన తెలంగాణ టిడిపి నేతలు

హైదరాబాద్, నవంబర్ 14: అధికార పార్టీ తీరును నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అధికార పక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని గవర్నరుకు ఫిర్యాదు చేశామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో తమ గొంతు వినిపించకుండా చేసేందుకే ప్రభుత్వం కుట్రపూరితంగా ఎమ్మెల్యేలను వారం పాటు సస్పెండ్ చేసిందని గవర్నర్ కు చెప్పామన్నారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరామన్నారు. నిజామాబాద్ ఎంపి రెండు చోట్ల సమగ్ర కుటుంబ సర్వేలో పేరు నమోదు చేసుకున్నట్టుగా పత్రికల్లో వచ్చింది నిజమేనా అని రేవంత్ రెడ్డి అడగటం తప్పా అని వారు ప్రశ్నించారు. కేసీఆర్ పెత్తందారి విధానం స్పష్టంగా కనబడుతోందన్నారు వారు ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్ అడ్డంపెట్టుకొని టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలందరూ తెలంగాణ ప్రభుత్వం వైపు చూస్తున్నారని వారు తెలిపారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఆర్.కృష్ణయ్య, ఎల్.రమణ, మోత్కుపల్లి నరసింహులు తదితరులు ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.