గాలి జనార్ధన్ రెడ్డి కి బెయిల్ మంజూరు

gali janardhan reddy-20

గాలి జనార్ధన్‌రెడ్డి (పాత చిత్రం)

దిల్లీ, జనవరి 20: ఓబులాపురం మైనింగ్ కంపెని (ఓఎంసీ) కేసులో గాలి జనార్ధన్‌రెడ్డికి ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తే అభ్యంతరం లేదని సీబీఐ పేర్కొనడంతో సుప్రీంకోర్టు గాలి జనార్ధన్ రెడ్డికి షరతులతో కూడిని బెయిల్ మంజూరు చేసింది.

రూ.30 లక్షల పూచీకత్తు సమర్పించాలని జనార్ధన్ రెడ్డికి కోర్టు ఆదేశించింది. బళ్లారి వెళ్లకూడదని, పాస్‌పోర్టు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో 2011 సెప్టెంబర్ 5న జనార్ధన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. సుమారు మూడు సంవత్సరాల తర్వాత గాలికి బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. గాలి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.