గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు : కేసీఆర్

ఆదిలాబాద్, అక్టోబర్ 8: ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు, దానికి ఆదివాసీ యోధుడు కొమురం భీమ్ పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలో బుధవారం జరిగిన కొమురం భీమ్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ కొమురం భీమ్ స్ఫూర్తితోనే పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో కొమురం భీమ్‌కు సరైన గుర్తింపు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ 10 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆయన కుటుంబంలోని ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జోడేఘాట్ కేంద్రంగా 100 ఎకరాల్లో పర్యాటక కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు. ముందుగా జోడేఘాట్‌లోని కొమురం భీమ్ సమాధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం కొమురం భీమ్ స్మారక స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. కొమురం బీమ్ మ్యూజియం నిర్మాణానికి ఏర్పాటుచేసిన పైలాన్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.