గృహసముదాయానికి కేసీఆర్ శంఖుస్థాపన

హైదరాబాద్, అక్టోబర్ 3: సనత్ నగర్ లోని బోయిగూడ ఐడీహెచ్ కాలనీలో నూతన గృహసముదాయానికి శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో లక్షల కోట్ల విలువైన కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. నగరంలో మురికివాడ అనేది లేకుండా అద్భుతమైన కాలనీలు నిర్మిస్తామని చెప్పారు. ఏ బస్తీలోని ప్రజలకు ఆ బస్తీలోనే భవనాలు నిర్మించిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు మాదిరిగా బస్తీలను కూల్చేందుకు బుల్డొజర్లు పంపించమని వెల్లడించారు. హైదరాబాద్‌లోని మురికివాడల్లో త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రి టి.పద్మారావు, ఎం.పి బండారు దత్తాత్రేయ, స్థానిక శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.