గోదావరికి కార్తీక హారతి

రాజమండ్రి, నవంబర్ 7: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పవిత్ర గోదావరి నదీమ తల్లికి మంగళహారుతులు ఇచ్చారు. పుష్కరఘాట్ లో గురువారం రాత్రి ఈ కార్యక్రమం కనులపండువగా జరిగింది. వేద మంత్రాల మధ్య గోదావరి తీరం నిత్యం సస్యశ్యామలంతో కళకళలాడాలని ప్రార్థిస్తూ గోదావరి మాతకు హారతులిచ్చారు. కొత్త కళతో రాజమండ్రి పులకించింది. భక్తులు అశేష సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించి తరించారు.

 

ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన పలువురికి బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో పురస్కారాలను అందజేశారు. సాహితీవేత్త శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి స్మారక పురస్కారాన్ని రిటైర్డ్ ఐపిఎస్ రావులపాటి సీతారామారావుకు, ఉత్తమ చిత్రాల నిర్మాత ఎ.రవిశంకర ప్రసాద్ స్మారక పరస్కారాన్ని మల్లేపల్లి లక్ష్మయ్యకు, సర్ ఆర్ధర్ కాటన్ స్మారక పురస్కారాన్ని రిటైర్డ్ ఛీప్ ఇంజనీర్ బి.వి.ఎస్.రామారావుకు, ఎస్.వి.రంగారావు స్మారక పురస్కారాన్ని దాసరి నారాయణరావుకు, గంటి మోహన చంద్ర బాలయోగి స్మారక పురస్కారాన్ని డాక్టర్ సునీత కృష్ణన్ కు అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖా మంత్రి పి.మాణిక్యాలరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్, రాజమండ్రి మేయర్ పంతం రజనీశేషసాయి, రాజమండ్రి ఎమ్మెల్యే డా.ఆకుల సత్యనారాయణ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, ప్రభుత్వ విఫ్ చైతన్య రాజు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రవివర్మ,,  ప్రముఖ సంపాదకులు కె.రామచంద్రమూర్తి (సాక్షి), కె.శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి), మాజీ డిజీపి అరవిందరావు తదితరులు హాజరయ్యారు. బుద్ధవరపు ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బిఎస్ ఎన్ కుమార్ స్వాగతం పలికారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.