గోరఖ్పూర్ వద్ద ఘోర రైలు ప్రమాదం : 12 మంది మృతి

హైదరాబాద్ : ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్పూర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. రాష్ట్ర రాజధాని లక్నో నుండి దాదాపు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోరఖ్సూర్ పట్టణ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మృతి చెందగా దాదాపు 45 మందికి గాయాలయపాలయ్యారు. మీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్రిషక్ ఎక్స్ ప్రెస్, బరౌనీ ఎక్స్ ప్రెస్ రైళ్లు గోరఖ్పూర్ సమీపంలో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో గోరఖ్పూర్-వారణాసి మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  మృతిచెందిన వారికి రూ 50 వేలు, తీవ్రంగా గాయపడివారికి రూ 25 వేలు నష్ట పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.