గ్యాస్ సబ్సిడీకి ఆధార్ తప్పనిసరి కాదు: మొయిలీ

న్యూఢిల్లీ: వంట గ్యాస్ పై సబ్సిడీకి ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తేల్చిచెప్పేంత వరకు కార్డు తప్పనిసరి కాదని బుధవారమిక్కడ మీడియాతో అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వు ఇచ్చిన నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.