గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో ఇద్దరి మృతి

విశాఖపట్నం, డిసెంబర్ 9: విశాఖలో విషాదం జరిగింది. పూర్ణా మార్కెట్ సెంటర్ లో ఓ ఇంట్లో తెల్లవారుజామున గ్యాస్ సిలెండర్ పేలుడు ఘటనలో ఇద్దరు మృతిచెందారు. వారిలో ఒకరు రెండు నెలల శిశువు కూడా ఉంది. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

రంగ్రీజ్ వీధిలోని ఓ కొండమీద ఉన్న ఇంట్లో పెద్ద శబ్దంతో సిలెండర్ పేలింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఇంట్లో వస్తువులన్నీ కాలి బుడిదయ్యాయి. ఈ శబ్దానికి రెండు నెలల శిశువు మృత్యువాత పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని చికిత్స కోసం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిని వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఐసీయులో ఉంచి చికిత్స చేస్తున్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కలవారు భయంతో ఒణికిపోయారు. శబ్దానాకి భవనం కూడా కూలిపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో అనే తెలియని పరిస్థితుల్లో అక్కడివారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న విశాఖ ఆర్ డీ వో, ఎం ఆర్ ఓ, ఇతర పోలీసు అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. క్షతగత్రులను ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.