గ్రేటర్ లో మధ్యతరగతి నివాసాలకు ఇంటి పన్ను మినహాయింపు

హైదరాబాద్, నవంబర్ 6: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో పేద, మధ్య తరగతి ప్రజలకు వూరట కలుగనుంది. ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని  స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.  ఈ మినహాయింపును రూ 4 వేల లోపు ఆస్తి పన్ను చెల్లిస్తున్న వారికి వర్తింప చేయాలని కమిటీ నిర్ణయించింది. దీంతో 10 లక్షల కుటుంబాలకు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఆస్తిపన్ను మాఫీతో జీహెచ్‌ఎంసీపై రూ.120 కోట్ల భారం పడనుంది. పేదలకు, మధ్యతరగతి వారికి మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్టాండింగ్ కమిటీ ప్రకటించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.