ఘనంగా పీజేఆర్ వర్థంతి

PJR

హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజాలో దివంగత నేత పి.జనార్థన్ రెడ్డి ఆరో వర్థంతి కార్యక్రమం జరిగింది. పేద ప్రజల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు కృషి చేసిన పి.జనార్థన్ రెడ్డికి పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. కాంగ్రెస్ నేతలు వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకొన్నారు.

పీజేఆర్ ప్రజల మనిషి అని ఆయన ఆశయాలను కాంగ్రెస్ కార్యకర్తలు కొనసాగించాలని వీహెచ్ అభిలషించారు. హైదరాబాదు అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల తరలింపు, మెట్రో రైలు రావడానికి పీజేఆర్ ఎంతో కృషి చేశారని ఆయన పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.