ఘనంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలనంతరం దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. దసరా ఉత్సవాల తొలిరోజు స్వర్ణకవచాలంకృత కనదుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద, మంత్రోశ్చరణలతో మంగళవాయిద్యాలతో అమ్మవారిని ప్రత్యేక పల్లకిలో తోడ్కొని వచ్చి భవానీ దీక్షా మంటపంలో ప్రతిష్టించారు. భక్తులు జగన్మాతను దర్శించుకుని తరిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.