ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, అక్టోబర్ 2: ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. ట్యాంక్ బండ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ బెలూన్లను ఎగురవేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మ పాటలు, డప్పులు, వాయిద్యాలతో హుస్సేన్ సాగర్ ప్రాంతం మార్మోగిపోయింది. కళాకారుల నృత్యాలు కనువిందు చేశాయి. విద్యుత్ కాంతులతో సాగర తీరం దేదీప్యమానంగా వెలుగుతోంది. బతుకమ్మ వేడుకలను వీక్షించేందుకు మహిళలు వేలాదిగా తరలివచ్చారు. సద్దుల బతుకమ్మ వేడుకలకు పోలీసులు భారీ భద్రత కల్పించారు.

తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ తెలంగాణ పుష్పోత్సవం అనే పుస్తకాన్ని గవర్నర్‌ నరసింహన్‌ ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ తొలి మాస పత్రికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, నిజామాబాద్ ఎం.పి కవిత, మంత్రులు, రాజకీయ నాయకులు తదితరులు హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.