ఘనంగా ప్రారంభించిన బతుకమ్మ వేడుకలు

భువనగిరి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి బతుకమ్మ సంబరాలను తెలంగాణ అంతటా ఘనంగా జరిగాయి. బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో, తెలంగాణ పల్లెలు, పట్టణాలు, కార్యాలయాలు, దేవాలయాలు వద్ద బుధవారం బతుకమ్మ శోభతో మిలమిలలాడాయి.
బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజల ఉద్యమ ప్రతీకని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా భువనగిరిలో ఏర్పాటు చేసిన బంగారు బతుకమ్మ సంబురాలను ఆమె మంత్రి జగదీష్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజల బతుకు చిత్రం అన్నారు. ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబంగా ఎదిగిన బతుకమ్మ పండగ ఇంత పెద్దఎత్తున జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. మంత్రి జగదీష్‌రెడ్డి మాట్టాడుతూ  తెలంగాణ ప్రజల సంస్కృతి, జీవన విధానంలో బతుకమ్మ భాగ్యమన్నారు.

సచివాలయంలో జరిగిన ఉత్సవాల్లో పలువురు మహిళా అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వమే బతుకమ్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుండడంతో  సచివాలయమంతా సందడిగా మారింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.