చంద్రబాబుతో సమావేశమైన మంత్రులు నారాయణ, గంటా

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు,  పురపాలకశాఖ మంత్రి నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ గురువారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ  అంశంపై వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని,  దీనిలో భాగంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీనీ అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించిచ విషయం తెలిసిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.