చక్రిది సహజ మరణమే : ఫోరెన్సిక్ నివేదిక

chakri-15

సంగీత దర్శకుడు చక్రి (పాత చిత్రం)

హైదరాబాద్, జనవరి 29: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతిపై నెలకొన్న అనుమానం వీడిపోయింది. చక్రిది సహజ మరణమేనని ఫోరెన్సిక్ నిపుణులు నివేదికలో వెలువరించారు. చక్రి మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ గతంలో చక్రి భార్య శ్రావణి, ఆమె అత్తమామలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతి ఫిర్యాదుపై చక్రి అస్థికలను ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి నివేదిక వెల్లడించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.