చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలి : కోదండరాం

హైదరాబాద్: చిత్ర పరిశ్రమకు చెందిన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం కోరారు. గురువారం ఆయన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో అశాస్త్రీయంగా ఉన్న పన్ను విధానాన్ని మార్చాలని, అవసరమైతే జీవో ను సవరించాలని కోరారు.

అయితే శాస్త్రీయంగా పన్ను విధానాన్ని అమలు చేసేందుకు జీవోను సవరిస్తామని ఈ సందర్భంగా మంత్రి వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదే విధంగా పూనే తరహాలో తెలంగాణలో ఫిలిం ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ముఖ్యమంత్రితో చర్చించి  త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని మంత్రి తెలిపారన్నారు. మరో వైపు ఉస్మానియా యూనివర్శిటీ భూమిలో ఇళ్ళను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై కోదండరామ్ సమాధానాన్ని దాటవేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.