చిన్నారి శ్రీజను పరామర్శించిన పవన్ కల్యాణ్

ఖమ్మం, అక్టోబర్ 17: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజను సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం పరామర్శించారు. పాల్వంచ కేటీపిఎస్ లో పనిచేస్తున్న బండి నాగయ్య కుమార్తే శ్రీజ 7వ తరగతి చదువుతుంది. చిన్నతనం నుంచి పవన్ కల్యాణ్ అంటే శ్రీజకు అభిమానం. గత నెల 10వ తేదీన ఫిట్స్ రావడంతో చికిత్స చేయించుకుంటున్న సమయంలో శ్రీజ పవన్ కల్యాణ్ చూడాలని వెల్లడించడంతో మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ శ్రీజను కలుసుకొని పరామర్శించారు. బలహీనంగా ఉన్న శ్రీజ చెవి దగ్గర పలుమార్లు పవన్ పేరు పెట్టి పిలిచానా స్పందించకపోవడంతో ఆయన ఒకింత ఆవేదనకు గురయ్యారని తెలిసింది. శ్రీజ చెయ్యి పట్టుకుని చాలాసేపు ఆమె వద్ద నిలబడి ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. శ్రీజ కోలుకున్న తర్వాత హైదరాబాద్‌ తీసుకురావాలని బాలిక తల్లిదండ్రులను కోరారు. శ్రీజ కుటుంబానికి పవన్‌ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. రాజమండ్రిలో కొన్న బొమ్మలను పవన్‌ చిన్నారి శ్రీజకు అందజేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.