చిరంజీవి నోట పవన్ కళ్యాణ్ మాట

Chiranjeevi-pavan

నటుడు, నిర్మాత నాగబాబు కుమారుడు వరుణ్ తేజ హీరోగా తెరంగేట్రం చేస్తున్న తొలిచిత్రం షూటింగు గురువారం హైదరాబాదులో ప్రారంభమైంది. ముందుగా నటుడు, కేంద్రమంత్రి చిరంజీవి, ఆయన భార్య రేఖ దేవుడికి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం దేవుడి పటాలపై చిరంజివి క్లాప్ కొట్టి షూటింగు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హీరో పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, అర్జున్, శిరీష్, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఈ చిత్రం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాతలు, దర్శకులు కె.రాఘవేంద్రరావు, వినాయక్, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

అయితే సందర్భంగా ఎక్కడ.. కళ్యాణ్ ఎక్కడ? అంటూ తన చిన్న తమ్ముడిని కేంద్ర మంత్రి చిరంజీవి అడిగారు. అయితే అప్పటికే పవన్ కల్యాణ్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. చిరంజీవి పెద్దతమ్ముడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా రంగప్రవేశం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘తనను ఎవరైనా ఏం సంపాదించావు? చిరంజీవి’ అని అడిగితే అభిమానులను సంపాదించానని గర్వంగా చెబుతుంటానని తెలిపారు.

తన జీవిత ప్రయాణంలో ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. తన వారసులుగా రాంచరణ్, బన్నీ, శిరీష్ ఉన్నారని మరో వారసుడు వరుణ్ తేజ్ ను సినీరంగానికి పరిచయం చేస్తున్నానని ఆయన తెలిపారు. ఆరుడుగుల మూడంగులాల అందగాడు వరుణ్ తేజ్ ను ఆదరించాల్సిన బాధ్యత అభిమానులదేనని ఆయన తెలిపారు.

వరుణ్ కు రామ్ చరణ్ అన్న ఆదరణ ఉంటుందని అన్నారు. వారిద్దరూ సినిమాల మీద మంచి విశ్లేషణలు చేసుకుంటారని, తాను వాటిని విని ఆనందిస్తానని చిరంజీవి అన్నారు. వీరంతా అభిమానుల పట్ల కృతజ్ఞతలు కలిగి ఉండాలని అన్నారు. అభిమానులను అలరించేందుకు, ఆహ్లాదకరంగా ఉంచేందుకు కష్టపడాలని చిరు సూచించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.