చీపురు పట్టిన అక్కినేని కుటుంబం

akkineni-swatcha bharathహైదరాబాద్, అక్టోబర్ 26: హీరో అక్కినేని నాగార్జున చీపురు పట్టారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన `స్వచ్ఛ భారత్`  కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు నాగార్జున సభ్యులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమల, నాగ చైతన్య, అఖిల్, సుశాంత్, కలిసి అన్నపూర్ణ స్టూడియో సమీపంలో వారు చెత్తాచెదారాన్ని ఉడ్చారు. అనంతరం పరిసరాల శుభ్రతకు నిరంతరం పాటు పడతామని అందరిచేత నాగార్జున ప్రతిజ్ఞ చేయించారు. `స్వచ్ఛ భారత్` లో కార్యక్రమంలో ఎక్కువమందిని భాగస్వాములు చేసేందుకు నాగార్జున వెబ్ సైట్ ను ప్రారంభించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.