చెస్ట్ ఆస్పత్రి తరలింపుపై జోక్యం చేసుకోలేం : హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చెస్ట్ ఆస్పత్రి తరలింపుపై తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నాగం జానర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. చెస్ట్ ఆస్పత్రి తరలింపు చట్ట, రాజ్యాంగ వ్యతిరేకమని, ఎవరిని సంప్రదించకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు.

పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనిలో రాజ్యాంగ వ్యతిరేకత ఏముందని పిటీషనర్ ను ప్రశ్నించింది. చెస్ట్ ఆస్పత్రి తరలింపు చట్ట, రాజ్యాంగ వ్యతిరేకం కానప్పుడు జోక్యం చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా అంటువ్యాధుల ఆస్పత్రులు నగర శివార్లో ఉండటమే మంచిదని, అలాగే ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన  నిర్ణయాల్ని ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.

హైకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ చెస్ట్ ఆస్పత్రి తరలింపుపై ఇబ్బందులు తెలపమని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. చెస్ట్ ఆస్పత్రి తరలింపుపై ఇబ్బందులు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తానని అదేవిధంగా దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరంగా లేఖ రాయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆస్పత్రి తరలింపుతో రోగులు ఏ విధంగా ఇబ్బందులు పడతారో కూడా ఆ లేఖలో తెలపబోతున్నట్లు నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.