ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ఘాతుకం :13 మంది జవాన్లు మృతి

moist-1-sa

(పాత చిత్రం)

హైదరాబాద్, డిసెంబర్ 1: ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లా చింతగుఫా వద్ద సోమవారం మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో ఇద్దరు అధికారులతో పాటు 13 మంది సిఆర్ పిఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో 5 గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సుకుమా జిల్లా, చింతగుఫా వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. మంగళవారం నుంచి అమరవీరుల వారోత్సవాలు నిర్వహణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రత దళాలు సుకుమా జిల్లా చింతగుఫా వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రజలతో కలిపిపోయిన మావోయిస్టులు ఒక్కసారిగా మెరుపుదాడి చేయడంతో 13 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలతోపాటు గాయపడిని వారిని జగదల్ పూర్ తరలిస్తున్నారు. మావోయిస్టులు చేసిన దాడి అత్యంత హేయమైన చర్య అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.