“జనసేన“కు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

janasena-11

హైదరాబాద్, డిసెంబర్ 11: సినీ హీరో పవన్ కళ్యాణ్ ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. 24 నవంబర్ 2014 నుంచి జనసేనను రాజకీయపార్టీగా గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి ఓ పార్టీ కావాలంటూ ప్రసంగించిన తీరు యువతను బాగా ఆకట్టుకుంది. సాధారణ ప్రజల సైతం మంచి గుర్తింపు వచ్చింది. అదే రోజు పవన్ జనసేన పార్టీని ప్రకటించారు. అయితే కొన్ని కారణాలచేత ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. కాని “అవినీతి అంతమే నా పంతంమంటూ కాంగ్రెస్ హఠావో“ అనే నినాదాన్ని అందుకున్నారు. కేవలం సినిమాలతోనే కాక సమాజంపై అవగాహన, ప్రజల బాగోగుల విషయంలో దూరదృష్టి ఉన్న వ్యక్తిగా పవన్ కు అన్ని వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్నది.

మోదీ, చంద్రబాబుతో కలిసి ఎన్డీఏ తరప్ఫున 2014 సార్వత్రిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. టీడీపీ, భారతీయ జనతాపార్టీ బలానికి పవన్ కు జనాకర్షణ తోడవడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. టీడీపీ విజయంలో పవన్ పాత్ర చాలా ఉందని సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే అన్నారంటే ఎన్నికల్లో ఆయన గాలి ఎలా పనిచేసిందో అర్ధం చేసుకోవచ్చు.

ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ పవన్ పూర్తిస్థాయి నటుడిగా పరిమితమయ్యారు. అయినా పార్టీ నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. వచ్చే ఎన్నికల నాటిని పార్టీని బలోపేతం చేస్తానని గతంలోనే ప్రకటించారు ఆయన. ఇంకా నాలుగున్నర సంవత్సరాల సమయం ఉంది. కనుక ఇంకా వేచి చూస్తారా లేక గుర్తింపు వచ్చింది కాబట్టి ఇప్పటినుంచే సంస్థాగత నిర్మాణం చేపడతారా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.