జన్మదినం సందర్భంగా తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 64వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ రోజు ఉదయం నరేంద్ర మోదీ గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉంటున్న తల్లి హీరాబెన్ వద్ద ఆశ్వీర్వాదం తీసుకున్నారు. జమ్ము, కాశ్మీర్ లో ఇటవీల సంభవించిన వరదలకు స్పందించి హీరాబెన్ (95) ప్రధాని మంత్రి సహాయ నిధికి రూ 5,000 విరాళంగా ఇచ్చారు.

Modi Birth day 1ఎటువంటి భద్రత లేకుండా అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ (సుమారు 23 కీలోమీటర్ల దూరం) కు మోదీ ఒంటరిగా వాహనం నడుపుకుంటూ తన తల్లి హీరాబెన్ ను కలుసుకున్నారు. గాంధీనగర్ చేరుకున్న మోదీ తల్లి పాదాలకు నమస్కరించి సుమారు 15 నిమిషాలు గడిపారు. హీరాబెన్ మోదీ పుట్టిని రోజు సందర్భంగా మిఠాయి తినిపించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుజరాత్ కు రావడం ఇదే ప్రథమం. మేలో జరిగిన మోదీ ప్రమాణస్వీకారానికి ఢిల్లీకి వెళ్లనప్పటికి,  హీరాబెన్ ఇంటి వద్దనే ఉండి టీవీలోనే వీక్షించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.