జన్ లోక్ పాల్ బిల్లును ఆమోదించిన ఆమ్ ఆద్మీ

AAP-Jan-lokpal-bill

అవినీతిపరుల భరతం పడతామన్న ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా జన్ లోక్ పాల్ బిల్లు తీసుకోచ్చేందుకు ఆప్ సర్కార్ అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని మంత్రివర్గం జనలోక్ పాల్ తుది బిల్లును కాబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ రూపొందించిన ముసాయిదా బిల్లుపై చర్చించాక కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి నుంచి గ్రూప్ డీ ఉద్యోగస్తుడి వరకు అందరూ జనలోక్ పాల్ పరిధిలోకి వస్తారు. సీఎంకు, మంత్రులకు ప్రత్యేక రక్షణలు అంటూ ఏమి ఉండవు. నిజాయితీపరులైన అధికారులకు ఏటా అవార్డులు అందజేయడంతో పాటు అవినీతిని వెలుగులోకి తెచ్చిన వారికి రక్షణ చర్యలు వంటి అంశాలను బిల్లులో చేర్చారు.

అయితే కేంద్ర హోంశాఖ ఆమోదం కోసం ఈ బిల్లును పంపించడం లేదని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏ బిల్లునైనా అసెంబ్లీలో ప్రవేశపెట్టేముందు కేంద్ర హోంశాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. కాని ఈ ప్రతిపాదనను కేంద్రం వ్యతిరేకించే అవకాశాలున్నాయని తమకు సంకేతాలు అందుతున్నాయని మంత్రి మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు. లోక్ పాల్ లో ఏసీబీ విలీనం అయితే ఢిల్లీ పోలీస్, డీడీఏ, ఎన్ డీఎంసీలు జన్ లోక్ పాల్ పరిధిలోకి వస్తాయి కాబట్టే హోంశాఖ ఈ ప్రతిపాధనను వ్యతిరేకించే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

జన్ లోక్ పాల్ బిల్లుపై చర్చించేందుకు ఫిబ్రవరి 13 నుంచి 16 దాకా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు దేశ చరిత్రలో తొలిసారిగా ఈ సమావేశాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించింది. 16వ తేదీ చివరి రోజు సమావేశాల్లో ప్రజలు కూడా పాల్గొనేందుకు వీలుగా సమావేశాలను ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.