జయలలితకు బెయిల్ మంజూరు

న్యూఢిల్లీ : ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. జయలలితతో పాటు మరో ముగ్గురు నిందితులు శశికళ, నటరాజన్‌, ఇలవరసికి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అక్రమార్జన కేసులో గత aidmk supportsనెల 27 వ తేదీన బెంగళూరులోని పరపర అగ్రహారంలో ఉన్న ప్రత్యేక కోర్టు జయలలిత సహా నలుగురికి నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. తీర్పుపై కర్నాటక హైకోర్టుకు అప్పీలు చేసినప్పటకీ న్యాయమూర్తి తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి లోకూర్ లతో కూడిన ధర్మాసనం జయకు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ అన్నాడీఎంకే 43వ వ్యవస్థాపక దినోత్సవం కూడా కావడంతో అమ్మ ఈ రోజైనా బయటకు వస్తుందా రాదా అని కార్యకర్తలు ఉద్వేగానికి గురయ్యారు. ఎట్టకేలకు బెయిల్ రావడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.