జయలలితకు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్, అక్టోబర్ 7: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. జయలలిత దాఖలుచేసిన బెయిల్ పిటిషన్ ను ఈ రోజు విచారించిన న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. జయలలిత షరతులతో కూడిన బెయిల్ పొందడానికి ప్రాసిక్యూషన్ అభ్యంతరం తెలపకపోవడంతో ఆమెకు బెయిల్ మంజూరువు అవుతుందని అందరూ భావించారు. జయ తరపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల ఆమెను ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.