జాతీయ స్థాయిలో కేసీఆర్ లాబీయింగ్

kcr-in-delhi

పార్లమెంట్ లో ముసాయిదా బిల్లును గట్టేక్కించేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ పార్టీల మద్దతు కూడా గట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ లను కలిశారు. అనంతరం జెడియూ అధినేత శరత్ యాదవ్ ను కలిశారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
మంగళవారం కేసీఆర్, రాష్ట్రీయ లోక్ దళ్ నేత అజిత్ సింగ్ తో భేటీ అయ్యారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణ సాధించుకుంటున్న కేసీఆర్ కు అజిత్ సింగ్ అభినందనలు తెలిపారు. ఎన్నికల సమయంలో తెలంగాణ బిల్లును ఎవ్వరూ వ్యతిరేకించరన్నారు.
అనంతరం కేసీఆర్ సిపిఐ జాతీయ నేతలతో సమావేశమయ్యారు. సిపిఐ సీనియర్ నేత బర్దన్ తోపాటు, జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిలను కలిశారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామన్న సురవరం సుధాకర్ రెడ్డి సీమాంధ్రకు న్యాయం చేయాలని కోరారు.
జాతీయ పార్టీల నుంచి సానుకూల పవనాలు వీస్తుండటంతో త్వరలోనే తెలంగాణ కల సాకారమౌతుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని సుష్మా స్వరాజ్ స్పష్టంగా చెప్పారని, చిన్న చిన్న అవరోధాలున్నా అధిగమిస్తామని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.