జీవిత చరిత్రను రాస్తానంటున్న దాసరి

Dasari-narayana-rao

ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణ ఇప్పుడు ఏకంగా తన జీవిత చరిత్రను తానే రాస్తానని చెప్పారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలపై సీనియర్ జర్నలిస్టు వినాయకరావు రాసిన ‘విశ్వవిజేత విజయగాథ’ పుస్తకావిష్కరణ హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగా, ప్రముఖ నిర్మాత రాఘవ స్వీకరించారు. ఈ సందర్భంగా దాసరి తన మనసులోని మాటను వెల్లడించారు.

“ఈ పుస్తకంలో నేను తీసిన సినిమాల గురించి మాత్రమే వుంటుంది. నా జీవిత చరిత్రను మాత్రం భవిష్యత్తులో నేనే రాస్తాను. ఈ పుస్తకం రాయడానికి విషయసేకరణకు వినాయకరావు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు” అన్నారు దాసరి.

ఈ కార్యక్రమంలో ఇంకా టి. సుబ్బరామిరెడ్డి, కృష్ణంరాజు, రామానాయుడు, కె. విశ్వనాథ్, మోహన్ బాబు, కోడి రామకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, సి. కల్యాణ్, ఎన్. శంకర్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ ప్రభు కార్యక్రమాన్ని నిర్వహించాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.