జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

MPTC-ZPTC-elections

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమినషర్ రమాకాంత రెడ్డి విడుదల చేశారు. ఏఫ్రిల్ 6వ తేదీన జెడ్పీటీసీ, ఎంటీసీల ఎన్నికలు జరుగుతాయి. బ్యాలెట్ పెట్టెల ద్వారానే ఈ ఎన్నికలు జరుగుతాయని, ఈ నెల 17వ తేదీన ఆయా జిల్లాల్లో నోటిఫికేషన్లను కలెక్టర్లు విడుదల చేస్తారని ఈసీ చెప్పారు. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు, 21వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు. 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని ఆయన చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.