జైలు నుంచి జయలలిత విడుదల

బెంగళూరు: కర్ణాటక పరప్పన అగ్రహారం జైలు నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శనివారం మధ్యాహ్నం విడుదలయ్యారు. సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసినా, బెయిలు పత్రాలు ఇవ్వడంలో జాప్యం వల్ల ఆమె ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆమె గత 22 రోజులుగా జైలులో ఉన్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలు జయలలిత విడుదలతో సంబురాలు చేసుకుంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.