టిఆర్ఎస్ గూటికి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, అక్టోబర్ 30: ఆపరేషన్ ఆకర్ష్ తో దూసుకుపోతున్న టిఆర్ ఎస్ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆహ్వానించింది. వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టిఆర్ఎస్ లో చేరనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. వారిద్దరిని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. నవంబర్ 2న జరిగే భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ చేరనున్నట్టు భేటీ అనంతరం రెడ్యానాయక్ ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, బంగారు తెలంగాణ నిర్మాణం కొరకు అందరం కలిసి పనిచేయాలి అనే ఉద్దేశంతో అధికార పార్టీలో చేరుతున్నట్టు రెడ్యానాయక్ తెలిపారు. టీఆర్ ఎస్ ప్రభుత్వంలోనే నియోజక అభివృద్ధి జరుగుతుందనే ఆశతో పార్టీలో చేరుతున్నట్టు చెవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.