టిడిపి ఎమ్మెల్యే ల బహిష్కరణ

రేవంత రెడ్డి చుట్టూ వివాదాం
సమగ్ర సర్వేపై వివాస్పద వ్యాఖ్యలు
క్షమాపణ చెప్పడానికి నిరాకరణ
వెరసి సభనుంచి బహిష్కారం

 

తెలంగాణ శాసనసభలో తెలంగాణ టిడిపీల సస్పెన్షన్ వివాదాస్పదమవుతోంది. కేసీఆర్ కుటుంబమే సభను శాసిస్తోందని ఆరోపించిన టిడిపి సభ్యులు ఆందోళన బాట పట్టారు. ఈ రోజు గవర్నర్ ను కలిసి అసెంబ్లీలో జరిగింది వివరించబోతున్నారు. అలాగే సస్పెండ్ అయిన వారంరోజులు ఆందోళనతో హోరెత్తిస్తామన్నారు.

 

నిజామాబాద్ ఎంపి కవిత సమగ్ర సర్వే లో రెండు చోట్ల పేర్లు నమోదు చేయించుకున్నారంటూ టిడిపి నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు శాసనసభను కుదిపేశాయి. రేవంత రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని అధికారపక్షం పట్టుబట్టడంతో సభ ముందుకు సాగలేదు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా టిడిపి సభ్యులు ఆందోళనకు దిగడంతో 10 మంది ఎమ్మెల్యేలను వారం రోజులపాటు సభాపతి సస్పెండ్ చేశారు.

 

yerrabelli 13సస్పెన్షన్ తర్వాత టిడిపి ఎమ్మెల్యేలు సభనుంచి వెళ్లకపోవడంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు పంపించాల్సి వచ్చింది. ఆ తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన చేశారు. కేసీఆర్ కుటుంబమే శాసనసభను శాసిస్తున్నదని మంత్రులంతా డమ్మీలుగా మారారని ఎర్రబెల్లి దయాకర్ ఆరోపించారు. అధికారపక్ష తీరును ఇతర విపక్షాలతో కలిసి ఎండగడతామని ఆయన తెలిపారు.

 

ఎంతకీ అక్కడి నుంచి వారు వెళ్లకపోడంతో పోలీసులు వారిని బలవంతంగా తరలించారు. అక్కడి నుంచి వెళ్తూ ఎమ్మెల్యేలు రోడ్డుపై భైఠాయించడంతో అసెంబ్లీ దగ్గర ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి. పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టుచేసి ఘోషామహల్ పోలీసుస్టేషన్ కు తరలించారు.

 

tdp mlas arrest 13సస్పెన్షన్, అరెస్ట్ కు నిరసనగా పోలీసు స్టేషన్ లోనే భైఠాయించాలని ముందుగా ఎమ్మెల్యేలు భావించినా, అ తర్వాత తమ ఆలోచనలను విరమించుకున్నారు. గవర్నర్ ను కలసి పరిస్థతి వివరించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. సస్పెండ్ అయిన వారం రోజులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో  రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.