టీఆర్ఎస్ ను వీడిన మహిళా విభాగం కార్యదర్శి

Rahamunnisa-trs

తెలంగాణ రాష్ట్ర సమితికి మరో షాక్ తగిలింది. పలు పార్టీల నేతలు గులాబీ కండువా కప్పుకుంటుంటే, ఈ మధ్య ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది అసంతృప్త నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ మహిళా విభాగం కార్యదర్శి రెహమున్నీసా మంగళవారం రాజీనామా చేశారు. అమరవీరులు, ఉద్యమకారులకు కేసీఆర్ ద్రోహం చేశారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. ఆయన చెబుతున్న తెలంగాణ పునర్నిర్మాణం జరగదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబ పాలన తప్పదని విమర్శించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.