టీఆర్ఎస్ పై చెరకు సుధాకర్ విమర్శలు

cheruku-sudhakar

తెలంగాణ రాష్ట్ర సమితిపై ఆ పార్టీ నేత చెరుకు సుధాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏం చేశానని తనను దూరం పెట్టారని పార్టీ అధినేత కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎన్నికల బరిలో దిగేందుకు తాను సరైన అభ్యర్థి కాదని టీఆర్ఎస్ నేత కేకే చెప్పగలుగుతారా..? అంటూ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని, రాజకీయ పార్టీ అని భావించి నట్లైయితే తెలంగాణలో టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఎంలు అంటరాని పార్టీలు కావన్నారు. అన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తరపున పని చేసిన కొండా దంపతులు ఎన్నికల్లో గెలిస్తే ఉద్యమ పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ గొప్పతనం ఏముందని నిలదీశారు. తెలంగాణ ప్రజలు మానసిక సంఘర్షణకు లోనవుతున్నారని, ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీనే కోరుకుంటున్నారని.

Have something to add? Share it in the comments

Your email address will not be published.