టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, నగేష్

tdp-mlas-join-trs

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యేలు నగేష్, సత్యవతి రాథోడ్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారిద్దరికి గులాబీ కండువా వేసి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాను వలస పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వరంగల్ జిల్లాకు కృష్ణా, గోదావరి నదుల జలాల్లో వాటా ఉందని అన్నారు. ఆ నీటిని వరంగల్ జిల్లా సాగు అవసరాలకు సరఫరా చేసి పచ్చదనంతో కనువిందు చేసేలా చేస్తానని కేసీఆర్ అన్నారు. తెలంగాణను సువర్ణ రాష్ట్రంగా తయారు చేస్తానని ఆయన అన్నారు. ఆంధ్రా పాలకులు మోసం చేయడం వల్ల వరంగల్ జిల్లా సస్యశ్యామలం కాలేకపోయిందని, తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉండదని కేసీఆర్ వెల్లడించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.