టీఆర్ఎస్ విలీనం రెండేళ్ల క్రితం ముచ్చట

Trs-ktr

తెలంగాణ ఇవ్వగానే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి మొదటినుంచి చెబుతూనే వస్తుంది. కానీ కేసీఆర్ తనయుడు, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడిన మాటలు వేరేలా ఉన్నాయి. విజయోత్సవ ర్యాలీ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… రెండేళ్ల కిందట విలీనం చేస్తామని చెప్పామని, ప్రస్తుతానికి దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

అయితే, దిగ్విజయ్ సింగ్ అంతకు ముందే కేసీఆర్ విలీనం చేస్తామని చెప్పాకే సోనియాగాంధీ, రాహుల్ తో సమావేశమయ్యారని చెప్పారు. విలీనానికి సంబంధించి నిర్ణయం జరిగిందని, మిగతా అంశాల పైనే తుది కసరత్తు జరుగుతోందని కూడా డిగ్గిరాజా అన్నారు. ఈ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులు టీఆర్ఎస్ పార్టీని ఎట్టిపరిస్థితుల్లో విలీనం చేయొద్దని, పార్టీ ఎప్పటికీ ఇలానే ఉండాల్సిందేనని వారు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేసారు. తెలంగాణ రాష్టం సాధించినంత మాత్రానే టీఆర్ఎస్ పని అయిపోలేదని, రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకునే బాధ్యత కూడా టీఆర్ఎస్ పై ఉందని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.