టీడీపీ ప్రజాగర్జనకు నన్ను ఆహ్వానించలేదు: హరికృష్ణ

Harikrishna-Nandamuri

హరికృష్ణకు, టీడీపీకి మధ్య అంతరం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. సమైక్యాంధ్ర విషయంలో కనీసం అధ్యక్షుడు చంద్రబాబును కూడా సంప్రదించకుండా తన రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామ చేయడం జరిగింది. ఆయన తొందరపాటు తనమే ఆయనకు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం టీడీపీ తిరుపతిలో నిర్వహించనున్న ప్రజాగర్జన సభకు తనకు ఆహ్వానం అందలేదని హరికృష్ణ ప్రకటించడం విశేషం. దీన్నిబట్టి చూస్తే ఇదంతా ఆయన స్వయంకృతాపరాధమే అని తెలుస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.