టీ-బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన న్యాయశాఖ

పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014కు కేంద్ర న్యాయశాఖ ఈరోజు (బుధవారం) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆమోదముద్ర పడిన అనంతరం బిల్లు నేరుగా కేంద్ర హోంశాఖకు చేరుకుంటుంది. హోంశాఖ నుంచి బిల్లు ఈ రోజు రాత్రికల్లా రాష్ట్రపతి భవన్ కు చేరుతుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ బిల్లు పూర్వాపరాలు పరిశీలించనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.