టెర్మినల్ పేర్లు యధాతథం : అరుణ్ జైట్లీ

arun jaitely-26

రాజ్యసభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ

హైదరాబాద్, నవంబర్ 26: శంషాబాద్ ఏయిర్ పోర్టు దేశీయ టర్నినల్ పేరు మార్పుపై రాజ్యసభ దద్దరిల్లింది. దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు కొనసాగుతుందని కేంద్ర ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాలు, సమాచా ప్రసార శాఖల మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో ప్రకటన చేయడంతో, కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి వచ్చి నిరసన తెలిపారు. దీనిపై మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ పేరు మార్పుపై వెనక్కు తగ్గేది లేదని, అంతర్జాతీయ టెర్మినల్ కు రాజీవ్ గాంధీ పేరు, దేశీయ టర్నినల్ కు గతంలో ఉన్న ఎన్టీఆర్ పేరునే కొనసాగుతుందని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ ఇద్దరూ గౌరవప్రదమైన నేతలేనని దీనిపై వివాదం చేయొద్దని అరుణ్ జైట్లీ సభ్యులకు సూచించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.  ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ ఒకే విమానాశ్రయానికి రెండు పెర్లు పెట్టడం సబబు కాదని తెలిపారు. పేరు మార్పుపై జారీ చేసిన జీవో రద్దుచేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.