టేకులగూడెం వద్ద మావోయిస్టుల విధ్వంసం

road roller-6

మావోయిస్టులు నిప్పంటించడంతో దహనమైన రోడ్డు రోలర్

హైదరాబాద్, జనవరి 6: ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. వాజేడు మండల పరిధిలోని టేకులగూడెం వద్ద చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారి రోడ్డు పనులు చేస్తున్న 9 వాహనాలను మావోయిస్టులు దహనం చేశారు. ఈ ఘటనలో 2 జేసిబీలతో పాటు, 4 లారీలు, ఒక రోడ్డు రోలర్, రెండు ట్రాలీలు ధ్వంసమయ్యాయి. సుమారు 40 మంది సాయుధులైన మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. తాజా ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు చత్తీస్ గడ్ సరిహద్దు గ్రామాల్లో బలగాలను మోహరించి మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.