డీఎల్ఎఫ్ వివాదానికి తమ ప్రభుత్వానికి సంబంధం లేదు : కేసీఆర్

డీఎల్ఎఫ్ వివాదానికి తమ ప్రభుత్వానికి సంబంధం లేదు : కేసీఆర్

డీఎల్ఎఫ్ వివాదానికి తమ ప్రభుత్వానికి సంబంధం లేదు : కేసీఆర్

హైదరాబాద్, నవంబర్ 20:  డీఎల్ఎఫ్ వివాదానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. డీఎల్ఎఫ్ భూముల వివాదంపై శాసనసభలో కేసీఆర్ విధాన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో 470.33 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపిఐఐసికి నిధుల సమీకరణకై గత ప్రభుత్వం అప్పగించిందన్నారు. దీనిలో భాగంగా డీఎల్ఎఫ్ సంస్థ రూ 580.51 కోట్లు చెల్లించి 30.31 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని తెలిపారు. ఇలా కొనుగోలు చేసిన భూమిని 34.83 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించి డీఎల్ఎఫ్ సంస్థ 2013 సెప్టెంబర్ 6న రిజిస్టర్ చేసుకుందన్నారు. అందులో కొంత భాగం వారసత్వ సంపద కింద నమోదై ఉన్నందున డీఎల్ఎఫ్ చేపట్టదలచిన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి జీహెచ్ఎంసి నిరాకరించిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో,  ప్రభుత్వం నిపుణలతో ఒక కమిటిని నియమించిందన్నారు. డీఎల్ఎఫ్ సంస్థకు అమ్మిన భూములు వారసత్వ సంపదలో భాగమని కాబట్టి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని నిపుణుల కమిటి ప్రభుత్వానికి సూచించిందన్నారు.

తాము కొన్న 31.30 ఎకరాల భూమికి ప్రత్నామ్నాయంగా ఇవ్వాలని లేదా తమ డబ్బును వడ్డీతోసహా తిరిగి చెల్లించాలని డీఎల్ఎఫ్ సంస్థ ప్రభుత్వాన్ని కోరిందన్నారు. అలాగే ప్రత్నామ్నాయ భూమి కేటాయించినట్లైతే మొదలు కొన్న భూమికి రిజిస్ట్రేషన్ చార్జీనే పరిణలోనికి తీసుకోవాలని కోరిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం రాయదుర్గం వద్ద డీఎల్ఎఫ్ కు ప్రత్నామ్నాయ భూములు కేటాయింపు జరిగిందని తెలిపారు. ఈ భూములకు సంబంధించిన అన్ని రకాల నిర్ణయాలు రాష్టం ఏర్పడకముందే జరగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.