ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు!

సక్రమంగా ఎన్నికలు జరిగి పార్టీలు సీట్లు గెల్చుకున్నప్పటికీ ఢిల్లీలో రాష్ట్రపతి పాలన తప్పేలా కనిపిస్తోంది. అటు బీజేపీ, ఏఏపీలు ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతికి సిఫారసు చేశారు. ఈ మేరకు ఓ నివేదిక సమర్పించిన గవర్నర్.. రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీని సుప్తచేతనావస్థలో పెట్టాలని కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.