ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అవతరించనున్న కేజ్రీవాల్

Aravind-kejriwal

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ అవతరించనున్నారు. ఈ మేరకు ఏఏపీ కేజ్రీను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంది. ఈ రోజు జరిగిన ఏఏపీ కీలక కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయం తీసుకున్నామని వారంతా ఏఏపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో వందలాది ఏఏపీ కార్యకర్తల మధ్య కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కేజ్రీవాల్ కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాము సిద్ధమని ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ కు కేజ్రీవాల్ విన్నవించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.