ఢిల్లీ టూర్‌లో సీఎం కేసీఆర్ బిజీ బిజీ

ఢిల్లీ, సెప్టెంబర్ 6: రాష్ట్ర సమస్యలను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. అనంతరం లోక్ సభాపక్షనేత జితేందర్ రెడ్డి మీడియాతో సమావేశం వివరాలు వెల్లడించారు. తెలంగాణకు ప్రత్యేక హోదా, పన్ను రాయితీ కల్పించాలని తదితర అంశాలకు సంబంధించిన 21 ప్రతిపాదనలను కెసి ఆర్ ప్రదాని ముందుంచారని తెలిపారు. రాష్ట్రానికి 4000 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్ర ఏర్పాటు, దానికి కావలసిన బొగ్గు కేటాయింపులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్ పార్క్, అదే విధంగా ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు మొత్తం 21 అంశాలపై సీఎం చంద్రశేఖర్ రావు ప్రధానితో చర్చించినట్లు ఆయన తెలిపారు..  అనంతరం విద్యుత్ మంత్రి గోయల్తో భేటీ అయి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావల్సిన 500 మెగావాట్ల విద్యుత్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అదే విధంగా రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణలోని విద్యుత్ ప్రాజెక్టులకు సరిపడ బొగ్గు కేటాయింపులు జరపాలని కేంద్రమంత్రిని కేసీఆర్ కోరారు.
అనంతరం న్యాయశాఖ మంత్రితో భేటీ అయి ఏపీకి కొత్త హైకోర్టును ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు ఇతర అంశాలకు సంబంధించి ఏర్పడిన న్యాయ వివాదాలతోపాటు ఇతర అంశాలపై కేంద్ర మంత్రితో కేసీఆర్ చర్చిస్తున్నట్టు సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.