తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రోశయ్య ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. టాన్సీ భూ కుంభకోణం కేసులో జయలలిత 2001లో జైలుకెళ్లడంతో మొట్ట మొదటి సారిగా పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టారు. జయలలిత జైలు నుంచి తిరిగి వచ్చేంతవరకు 6 నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేస్తూ పన్నీర్ సెల్వంతోపాటు కొంత మంది మంత్రులు కూడా ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.

శనివారం బెంగళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. అన్నాడీఎంకే శాసనసభ్యులు ఆదివారం సమావేశమై  రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వంను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.