తితిదే బోర్డును ప్రక్షాళనగావించండి: కిషన్ రెడ్డి

Kishan-reddy-bjp

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి వ్యవహారశైలిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. సామాన్య భక్తులను విస్మరించిన తితిదే అధికారులు వీఐపీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని విమర్శించారు. తిరుమలలో భక్తులపై కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు గంటల సేపు క్యూలైన్లో వేచి ఉన్నా శ్రీవారి దర్శన భాగ్యం కలిగే అవకాశాలు లేవని అన్నారు. ఆవేదనతో భక్తులు ఆందోళన చేస్తే కేసులు బనాయిస్తారా అంటూ మండిపడ్డారు.

సాక్షాత్తూ గవర్నర్ ఇచ్చిన సలహాలను కూడా తితిదే అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వేలాదిగా వీఐపీ పాసులను ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వీఐపీ పాసులను వేలాది రూపాయలకు అమ్ముకున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని అన్నారు. జరిగిన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.